YSRCP MLA Giddi Eswari Joining TDP Today | Oneindia Telugu

2017-11-27 1,904

YSRCP MLA from Paderu Giddi Eswari is joining the ruling TDP on Monday in Amaravati.

అనుకున్నదే జరిగింది. పాడేరు వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీ కండువా కప్పుకోవడానికి సన్నద్దమయ్యారు. ఆమెతో పాటు మరో 60 మంది ఎంపీటీలు, స‌ర్పంచ్‌లను వెంటబెట్టుకుని టీడీపీలో చేరనున్నారు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో సోమవారం ఆమె టీడీపీలో చేరనున్నారు. ఈమేర‌కు ఆదివారం సాయంత్రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి 25 వాహనాల్లో అమ‌రావ‌తికి బ‌య‌లుదేరారు. ఎమ్మెల్యే ఈశ్వ‌రి, ఆమె గురువు గోవింద‌రావు త‌దిత‌రులు మ‌రో రెండు వాహ‌నాల్లో బ‌య‌లుదేరారు.
విశాఖ ఏజెన్సీ ఏరియాలో గిడ్డి ఈశ్వరి బలమైన నేతగా ఉన్నారు. పదునైన మాట తీరుతో పలుమార్లు అధికార పక్షాన్ని కడిగిపారేశారు. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు ఉండవన్న మాట ఇప్పుడు గిడ్డి ఈశ్వరి విషయంలోను రుజువవుతోంది. గతాన్ని పక్కనబెట్టి భవిష్యత్తు రాజకీయాల కోసం ఆమె టీడీపీలో చేరుతున్నారు. వైసీపీలో భవిష్యత్తు ఇరుకుగా అనిపించడం వల్లే ఆమె వైసీపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది.